సాంకేతికతతో అగ్ని ప్రమాదాల నివారణ

ABN , First Publish Date - 2023-01-26T00:29:17+05:30 IST

సాంకేతికతను వినియోగించి అగ్ని ప్రమాదాలు నివారించవ్చని ట్రైనీ కలెక్టర్‌ రాధికా గుప్తా అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సత్తుపల్లి పురపాలక సంఘంలో ఆమె పట్టణంలో పర్యటించారు.

సాంకేతికతతో అగ్ని ప్రమాదాల నివారణ
జీవీ మాల్‌ మేనేజర్‌ భాస్కర్‌కు సూచనలిస్తున్న ట్రైనీ కలెక్టర్‌ రాధికా గుప్తా

సత్తుపల్లిరూరల్‌, జనవరి 25: సాంకేతికతను వినియోగించి అగ్ని ప్రమాదాలు నివారించవ్చని ట్రైనీ కలెక్టర్‌ రాధికా గుప్తా అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సత్తుపల్లి పురపాలక సంఘంలో ఆమె పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యాక్రమాన్ని సందర్శించి పలు సూచనలందించారు. అనంతరం జ్యోతినిలయం నుంచి మొదలుకొని పలు విద్యాసంస్థలు, వస్త్రవ్యాపార సముదాయాలను పరిశీలించారు. మునిసిపల్‌, అగ్నిమాపక శాఖ అధికా రులతో కలసి భవనాలలో తీసుకుంటున్న రక్షణ చర్యలను పరిశీలించారు ప్రమాద సమయంలో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆమె అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు. ఆమె వెంట కమిషనర్‌ కే.సుజాత, ఫైర్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌, ఇతర అధికారులు ఉన్నారు.

Updated Date - 2023-01-26T00:29:17+05:30 IST