ఘనమైన గణతంత్రం

ABN , First Publish Date - 2023-01-26T00:27:50+05:30 IST

భారతదేశం నేడు తన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకోనున్నది. ఉత్తమ రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకుని...

ఘనమైన గణతంత్రం

భారతదేశం నేడు తన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకోనున్నది. ఉత్తమ రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకుని ప్రజలే ప్రభువులైన గణతంత్ర దేశంగా ప్రపంచ దేశాల సరసన సగర్వంగా తలెత్తుకుని నిల్చుంది. ఎంతో మంది పాశ్చాత్య మేధావుల పెదవి విరుపుల్ని, సందేహాల్ని పటాపంచలు చేస్తూ బలమైన దేశంగా స్థిరంగా ఎదుగుతూ వస్తోంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ అన్ని రంగాల్లో ప్రపంచదేశాలతో పోటీపడుతూ ముందంజ వేస్తోంది. ఈ దశలో దేశం తనవైన విలువల్ని కొనసాగిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, రాజ్యాంగ స్ఫూర్తినీ మరింతగా ప్రజ్వలింపజేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కార్యనిర్వాహక – శాసన వ్యవస్థలకు, న్యాయ వ్యవస్థకు నడుమ అంతరం పెరిగింది. వారి వారి పరిధులపై అపోహలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. ప్రతీరోజూ ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. కొలీజియం వ్యవస్థ పట్ల ప్రభుత్వం తరపున న్యాయశాఖా మంత్రి, శాసనవ్యవస్థ తరపున ఉప రాష్ట్రపతి న్యాయ వ్యవస్థ పరిధిని ప్రశ్నిస్తున్నారు. అందుకు దీటుగా అత్యున్నత న్యాయస్థానం కూడా స్పందిస్తోంది. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం రాజ్యాంగ స్ఫూర్తిని, తాత్వికతను అర్థం చేసుకోవడంలోనే ఉంది.

డి.వి.జి. శంకరరావు

Updated Date - 2023-01-26T00:27:50+05:30 IST