భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. 28 రోజుల తర్వాత తిరిగొచ్చి తలుపులు తీసి చూడగానే నట్టింట్లో షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2023-01-20T19:32:36+05:30 IST

ఆ మహిళ తన భర్తతో గొడవ పడింది.. భర్త మీద అలిగి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.. భర్త ఎంత బతిమాలినా తిరిగి రాలేదు.. దాదాపు నెల రోజుల తర్వాత అలక వీడి పుట్టింటి నుంచి బయల్దేరింది.. ఇంటికి వెళ్లి తలుపులు తీసి నట్టింట్లో దృశ్యాన్ని చూసి నివ్వెరపోయింది..

భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. 28 రోజుల తర్వాత తిరిగొచ్చి తలుపులు తీసి చూడగానే నట్టింట్లో షాకింగ్ సీన్..!

ఆ మహిళ తన భర్తతో గొడవ పడింది.. భర్త మీద అలిగి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.. భర్త ఎంత బతిమాలినా తిరిగి రాలేదు.. దాదాపు నెల రోజుల తర్వాత అలక వీడి పుట్టింటి నుంచి బయల్దేరింది.. ఇంటికి వెళ్లి తలుపులు తీసి నట్టింట్లో దృశ్యాన్ని చూసి నివ్వెరపోయింది.. నట్టింట్లో ఉరికి ఓ అస్థి పంజరం వేలాడుతూ కనిపించింది.. అది భర్తదేనని తెలుసుకుని మహిళ షాకైంది.. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు (Crime News).

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) కాన్పూర్‌కు సమీపంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన సుదామ శర్మ తన భార్య కీర్తి శర్మ, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. డిసెంబరు 18వ తేదీన సుదామ, కీర్తి మధ్య గొడవ జరగింది. దీంతో కీర్తి.. భర్త మీద అలిగి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. డిసెంబర్ 21వ తేదీ వరకు తన భార్యతో సుదామ మొబైల్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంటికి తిరిగి వచ్చేయమని బతిమాలాడు. కీర్తి అలక వీడకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇల్లు ఊరికి దూరంగా ఉండడంతో ఎవరికీ విషయం తెలియలేదు.

బుధవారం ఉదయం కీర్తి తన పిల్లలతో కలిసి పుట్టింటి నుంచి అమీనాబాద్ చేరుకుంది. ఇంటి తలుపులు తీసి చూసి షాకైంది. 28 రోజులుగా మృతదేహం ఉరికి వేలాడుతుండడంతో పూర్తిగా పాడైపోయి అస్థిపంజరం (Skeleton) మాత్రమే మిగిలింది. కీర్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-20T19:32:36+05:30 IST