తండ్రి కిరాతకం.. వంట చేయలేదని భార్యపై కోపం.. కూతురి తల నరికి ఊరి చివర పాతేశాడు..!

ABN , First Publish Date - 2023-01-23T21:03:38+05:30 IST

బీహార్‌లోని (Bihar) ఓ వ్యక్తి అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. భార్యపై ఆగ్రహంతో నాలుగేళ్ల కూతురి తల నరికి చంపాడు. మృతదేహాన్ని నది ఒడ్డున భూమిలో పాతిపెట్టాడు. బాలిక గత ఐదు రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు అన్వేషణ సాగించారు.

తండ్రి కిరాతకం.. వంట చేయలేదని భార్యపై కోపం.. కూతురి తల నరికి ఊరి చివర పాతేశాడు..!

బీహార్‌లోని (Bihar) ఓ వ్యక్తి అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. భార్యపై ఆగ్రహంతో నాలుగేళ్ల కూతురి తల నరికి చంపాడు. మృతదేహాన్ని నది ఒడ్డున భూమిలో పాతిపెట్టాడు. బాలిక గత ఐదు రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు అన్వేషణ సాగించారు. చివరకు ఆ కర్కోటకుడు అసలు విషయం బయటపెట్టాడు. భార్య వంట చేయలేదనే కోపంలో కూతురి తల నరికేసినట్టు నిందుతుడి పోలీసుల ఎదుట అంగీకరించాడు (Crime News).

బీహార్‌లోని సరౌని గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఇంటికి వెళ్లాడు. అప్పటికి రాజ్‌కుమార్ భార్య వంట చేయలేదు. దీంతో భార్యతో గొడవపడ్డాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె కేకలు పెట్టుకుంటూ పక్కింటికి పారిపోయింది. ఇంట్లో నాలుగేళ్ల కూతురు మాత్రమే ఉంది. అప్పటికే ఆగ్రహంలో ఉన్న రాజ్‌కుమార్ భార్యపై కోపాన్ని కూతురిపై చూపించాడు. ఆమె తల నరికేశాడు (Man cut off his daugher`s head). అనంతరం మృతదేహాన్ని ఊరి చివర నది ఒడ్డున పాతిపెట్టాడు. తర్వాతి రోజు ఉదయం ఇంటికి వచ్చిన రాజ్‌కుమార్ భార్య కూతురి కోసం వెతికింది.

గ్రామంలోనూ, బంధువుల ఇళ్లలోనూ కూతురి గురించి అన్వేషణ సాగించింది. ఎక్కడా ఆ బాలిక ఆచూకీ దొరకలేదు. ఐదు రోజుల తర్వాత రాజ్‌కుమార్ తన తండ్రికి అసలు విషయం చెప్పాడు. ఊరి చివర పాతేసినట్టు చెప్పాడు. అందరూ వెళ్లి తవ్వి చూడగా బాలిక మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రాజ్‌కుమార్‌ను హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-01-23T21:03:38+05:30 IST