Tollywood : పేరుకేమో టాలీవుడ్ హీరో.. చేసేవన్నీ చెత్త పనులు.. సీన్ కట్ చేస్తే..

ABN , First Publish Date - 2023-02-04T17:45:07+05:30 IST

ఇదిగో ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని చూశారా.. అచ్చంగా హీరోలాగా (Hero) ఉన్నాడు కదూ.. అవును ఇతను నిజంగానే టాలీవుడ్‌లో హీరోనే (Tollywood Hero)...

Tollywood : పేరుకేమో టాలీవుడ్ హీరో.. చేసేవన్నీ చెత్త పనులు.. సీన్ కట్ చేస్తే..

హైదరాబాద్ : ఇదిగో ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని చూశారా.. అచ్చంగా హీరోలాగా (Hero) ఉన్నాడు కదూ.. అవును ఇతను నిజంగానే టాలీవుడ్‌లో హీరోనే (Tollywood Hero). ఇతని పేరు నవీన్ రెడ్డి అట్లూరి (Naveen Reddy Atluri). ఒకట్రెండు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే.. పేరుకే హీరో కానీ చేసేవన్నీ విలన్ (Villain) పనులు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఊచలు లెక్కెడుతున్నాడు. ఇంతకీ నవీన్ జైలుకెళ్లాల్సిన (Jail) పని ఏం చేశాడు..? ఇతనిపై ఫిర్యాదు చేసిందెవరు..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

Naveen-2.jpg

ఎవరీ నవీన్..!

నవీన్ రెడ్డి అట్లూరి టాలీవుడ్ హీరో అని చెప్పుకుంటూ చెలామణి అవుతున్నాడు. ఆ మధ్య ఒకట్రెండు చిన్న సినిమాల్లో కూడా నటించాడు. హీరో కంటే ముందు ఎన్ స్క్వేర్ (N square) కంపెనీలో డైరెక్టర్‌గా పని చేశాడు. కంపెనీ సహా డైరెక్టర్లకు (Directors) తెలియకుండా కంపెనీ ఆస్తులను తాకట్టుపెట్టాడు నవీన్. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ (Registration) చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. రూ.55 కోట్లకు పైగానే మోసం చేసినట్లు నవీన్ రెడ్డిపై భాదితులు (ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Naveen.jpg

దీనిపై హైదరాబాద్‌లోని (Hyderabad) సీసీఎస్‌లో (CCS) ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై సెక్షన్లు 420, 465, 471 R/W 34 IPC కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించి రిమాండ్ కోసం చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే.. మోసం చేసిన ఈ డబ్బులతో నవీన్ రెడ్డి జల్సాలు, ‘నో బడీ’ (NoBody) అనే పేరుతో హీరోగా సినిమా చేశాడని పోలీసులు గుర్తించారు. నవీన్ స్వగ్రామం సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కోడిపుంజులగూడెం. ఇతనిపై బైక్ దొంగతనం కేసులు కూడా చాలానే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే విచారించే కొద్దీ నవీన్ చిట్టా బయటికొచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు.. ఆ 55 కోట్ల రూపాయిలు ఎలా ఖర్చుపెట్టాడు..? ఖరీదైన కార్లు ఎలా వచ్చాయి..? అనేదానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు తెలియవచ్చింది.

Updated Date - 2023-02-04T17:55:26+05:30 IST