ఛీ..ఛీ.. అమె అసలు తల్లేనా..? ప్రియుడి మోజులో మూడేళ్ల పాపను చంపి.. వేగంగా వెళ్తున్న రైల్లోంచి విసిరేసి..

ABN , First Publish Date - 2023-01-20T15:25:23+05:30 IST

రాజస్థాన్‌లోని (Rajasthan) శ్రీగంగానగర్ జిల్లాలో ఓ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి కన్న కూతుర్ని అత్యంత కిరాతకంగా చంపేసింది. మూడేళ్ల పాపను గొంతు నులిమి చంపేసి కదులుతున్న రైలులో నుంచి బయటకు విసిరేసింది..

ఛీ..ఛీ.. అమె అసలు తల్లేనా..? ప్రియుడి మోజులో మూడేళ్ల పాపను చంపి.. వేగంగా వెళ్తున్న రైల్లోంచి విసిరేసి..

రాజస్థాన్‌లోని (Rajasthan) శ్రీగంగానగర్ జిల్లాలో ఓ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి కన్న కూతుర్ని అత్యంత కిరాతకంగా చంపేసింది. మూడేళ్ల పాపను గొంతు నులిమి చంపేసి కదులుతున్న రైలులో నుంచి బయటకు విసిరేసింది.. రైల్వే పట్టాల పక్కన పడి ఉన్న మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు నిందితులను పట్టుకున్నారు (Crime News).

శ్రీ గంగా నగర్‌లోని శాస్త్రి నగర్‌కు చెందిన సునీత అనే మహిళకు ఐదుగురు పిల్లలు. ఆమె ఏడాది క్రితం సన్నీ అనే వ్యక్తితో ప్రేమలో పడి భర్తకు దూరమైంది (Extra Marital Affair). ప్రియుడితో కలిసి వేరే ఇంట్లో ఉంటోంది. సునీత దగ్గరు ఇద్దరు కుమార్తెలు నివసిస్తుండగా, ముగ్గురు పిల్లలు సునీత భర్తతో ఉంటున్నారు. శనివారం రాత్రి సునీత తన మూడేళ్ల కూతురు కిరణ్‌ను గొంతు నులిమి చంపేసింది (Mother killed Daughter). అనంతరం మృతదేహాన్ని దూరంగా పారేసేందుకు ప్రయత్నించింది. మృతదేహాన్ని ఓ వస్త్రంలో ఉంచి సునీత, సన్నీ రైలు ఎక్కారు.

బాలిక మృతదేహాన్ని ఫతూహీకి సమీపంలో ఉన్న కాలువలో పడేయ్యాలనుకున్నారు. అయితే రైలు వేగంగా వెళ్తున్నందు వల్ల పాప మృతదేహం రైల్వే ట్రాక్ పక్కన పడిపోయింది. రైల్వే పట్టాల పక్కన పడి ఉన్న మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ పాప ఎవరో తెలుసుకునేందుకు పోలీసులకు దాదాపు మూడు రోజులు పట్టింది. సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమె నిజం అంగీకరించింది. దీంతో సునీతను, సన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-01-20T15:25:23+05:30 IST