పెట్రోల్‌ బంక్‌లో షాకింగ్ ఘటన.. బైక్‌లో రూ.300 పెట్రోల్ కొట్టించుకుని రూ.35 వేలు కొట్టేశాడు.. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోతో..

ABN , First Publish Date - 2023-02-06T16:28:34+05:30 IST

బీహార్‌లోని (Bihar) మోతీహరిలో 16 దోపిడీలకు పాల్పడిన కింగ్‌పిన్‌తో సహా ఐదుగురు దొంగలను ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా మోతీహరిలో ఇప్పటివరకు పలు రకాల దొంగతనాలకు పాల్పడి లక్షల్లో డబ్బు దోచుకున్నారు.

పెట్రోల్‌ బంక్‌లో షాకింగ్ ఘటన.. బైక్‌లో రూ.300 పెట్రోల్ కొట్టించుకుని రూ.35 వేలు కొట్టేశాడు.. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోతో..

బీహార్‌లోని (Bihar) మోతీహరిలో 16 దోపిడీలకు పాల్పడిన కింగ్‌పిన్‌తో సహా ఐదుగురు దొంగలను ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా మోతీహరిలో ఇప్పటివరకు పలు రకాల దొంగతనాలకు పాల్పడి లక్షల్లో డబ్బు దోచుకున్నారు. శుక్రవారం రాత్రి పెట్రోల్‌ బంకు ఉద్యోగిని బెదిరించి రూ.35 వేలు దోచుకెళ్లారు (Robbery in Petrol Bunk). ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు వెంటనే స్పందించి వారందరినీ ఆదివారం పట్టుకున్నారు (Crime News).

ఈ దోపిడీ కేసుల్లో మాస్టర్ మైండ్ అయిన గుడ్డు సాహ్ని వరుస దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు తలనొప్పిగా మారాడు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సుగౌలి ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంకు వద్దకు గుడ్డు తన స్నేహితులతో కలిసి చేరుకున్నాడు. మొదట బైక్‌లో రూ.300 పెట్రోల్ పోయించాడు. ఆపై సహచరులతో కలిసి బంకు వ్యక్తిపై దాడి చేశాడు. ఆయుధాలు చూపించి బెదిరించి రూ.35 వేలు దోచుకున్నాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. పెట్రోల్ బంకు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

TamilNadu: ఆరు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు.. హెల్మెట్ ధరించి ఆ భర్త చేసిన ఘోరమేంటంటే..

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. రాజా బజార్‌లో ఆ ముఠా ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి గుడ్డుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గుడ్డు సాహ్ని తన నేరాలను అంగీకరించాడు. గుడ్డు అందించిన సమాచారంతో ముఠాలోని మిగిలిన దొంగలను కూడా పోలీసులు పట్టుకున్నారు.

Updated Date - 2023-02-06T16:28:36+05:30 IST