jallikattu: జల్లికట్టులో యువకుడి మృతి

ABN , First Publish Date - 2023-01-20T09:42:00+05:30 IST

జల్లికట్టు(jallikattu) పోటీల్లో యువకుడు మృతిచెందిన వ్యవహారంపై ఆందోళన చేపట్టిన 36 మందిపై పోలీసులు ఏడు సెక్షన్ల

jallikattu: జల్లికట్టులో యువకుడి మృతి

- చర్యలు చేపట్టాలంటూ రాస్తారోకో

- ఆందోళనకారుల దాడిలో పోలీసులకు గాయాలు

- 36 మంది అరెస్ట్‌

వేలూరు(చెన్నై), జనవరి 19: జల్లికట్టు(jallikattu) పోటీల్లో యువకుడు మృతిచెందిన వ్యవహారంపై ఆందోళన చేపట్టిన 36 మందిపై పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. తిరుపత్తూర్‌ జిల్లా నాట్రాంపల్లి సమీపం కల్‌సారాంపట్టి గ్రామంలో బుధవారం జల్లికట్టు పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన జోలార్‌పేటకు సమీపం పెరియకమ్మయమ్‌పేట గ్రామానికి చెందిన ముష్రఫ్‌ అనే యువకుడు తిరుపత్తూర్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. యువకుడి మృతికి కారణమైన పోలీసులపై చర్యలు చేపట్టాలని కోరుతూ యువకులు, ప్రజలు బుధవారం రాత్రి నుంచి 5 గంటలపాటు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు యువకులు రాళ్లతో దాడిచేయగా 10 మంది పోలీసులు గాయపడగా, పోలీసు వాహనాల అద్దాలు పగిలాయి. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు 36 మందిని అరెస్ట్‌ చేసి తిరుపత్తూర్‌ కోర్టులో హాజరుపరచి వేలూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Updated Date - 2023-01-20T09:42:00+05:30 IST