మీ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా.. యువతిని బెదిరించి ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. చివరకు..

ABN , First Publish Date - 2023-01-29T16:19:54+05:30 IST

ముక్కూ, మొహం తెలియకుండా సోషల్ మీడియాలో పరిచయమైన వారితో చేసే స్నేహాలు చాలా మంది యువతీ యువకులను ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. జైపూర్‌కు చెందిన ఓ అమ్మాయిని ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడు (Instagram friend) బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

మీ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా.. యువతిని బెదిరించి ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. చివరకు..

ముక్కూ, మొహం తెలియకుండా సోషల్ మీడియాలో పరిచయమైన వారితో చేసే స్నేహాలు చాలా మంది యువతీ యువకులను ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. జైపూర్‌కు చెందిన ఓ అమ్మాయిని ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడు (Instagram friend) బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఇంటి ఎదురుగానే ఆత్మహత్య (Suicide) చేసుకుని చనిపోతానని బెదిరిస్తున్నాడు. ప్రతిరోజూ ఆమెను వేధించేవాడు. దీంతో బాధితురాలు నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడిపై ఫిర్యాదు చేసింది (Crime News).

జైపూర్‌లోని (Jaipur) కల్వాడ్‌కు చెందిన 19 ఏళ్ల యువతికి కొంతకాలం క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సల్మాన్ అనే యువకుడు పరిచయమయ్యాడు. తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఇద్దరూ మొబైల్ ద్వారా మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఆ యువతిని ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. అతడితో పెళ్లికి అమ్మాయి నిరాకరించింది. దీంతో పెళ్లి కోసం ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడు.

పెళ్లికి ఆ యువతి నిరాకరించడంతో నిందితుడు ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. పెళ్లికి ఒప్పుకోకపోతే మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుని చనిపోతానని బెదిరిస్తూ సందేశాలు పంపాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆ విషయం గురించి తన తల్లిదండ్రులతో చెప్పి నిందితుడిపై కేసు నమోదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2023-01-29T16:33:59+05:30 IST