రోడ్డు ప్రమాదంలోనే భార్య చనిపోయిందని భర్త కూడా నమ్మేశాడు.. కానీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-01-23T15:56:04+05:30 IST

ఆ మహిళ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది.. ట్రక్కు కింద పడడం వల్లే ఆమె మరణించిందని భర్తతో సహా అందరూ అనుకున్నారు.. పోస్ట్‌మార్టమ్‌లో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది.. ఆమెను ఎవరో గొంతు నులిమి చంపినట్టు తేలింది.. విచారణలో ఆమె వివాహేతర సంబంధం బయటపడింది..

రోడ్డు ప్రమాదంలోనే భార్య చనిపోయిందని భర్త కూడా నమ్మేశాడు.. కానీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ ట్విస్ట్..

ఆ మహిళ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది.. ట్రక్కు కింద పడడం వల్లే ఆమె చనిపోయిందని భర్తతో సహా అందరూ అనుకున్నారు.. అయితే పోస్ట్‌మార్టమ్‌లో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది.. ఆమెను ఎవరో గొంతు నులిమి చంపినట్టు తేలింది.. విచారణలో ఆమె వివాహేతర సంబంధం బయటపడింది.. చివరకు పోలీసులు అసలు నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది (Crime News).

షాకింగ్.. పోలీస్ స్టేషన్ ముందే కత్తితో గొంతు కోసుకున్న 24 ఏళ్ల యువకుడు.. అసలేం జరిగిందంటే..

నోయిడాలోని గిర్ధర్‌పూర్‌కు చెందిన మోనికా అనే మహిళకు పదేళ్ల క్రితం వివాహామైంది. ఏడేళ్లుగా ఆమె చరణ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం (Extra Marital Affair) సాగిస్తోంది. ఇద్దరూ తరచుగా కలుసుకునేవారు. ఈ నేపథ్యంలో తనకు ఓ ఇల్లు కొనివ్వాలని చరణ్‌పై మోనిక ఒత్తిడి తెచ్చేది. ఇల్లు కొనేందుకు చరణ్ కూడా సిద్ధమయ్యాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న చరణ్ కొడుకు రోహిత్ తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకు మోనికను చంపాలని తండ్రీకొడుకులు ప్లాన్ చేశారు. చరణ్ స్నేహితుడు సందీప్ కూడా ఈ ప్లాన్‌లో భాగమయ్యాడు. ఈ నెల 17వ తేదీన చరణ్‌తో కలిసి మోనిక బయటకు వెళ్లింది.

ఆమెను కారులో తీసుకెళ్లిన చరణ్ మార్గమధ్యంలో సందీప్, రోహిత్‌లను కూడా కారు ఎక్కించుకున్నాడు. అందరూ కలిసి మోనిక గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృత దేహాన్ని రోడ్డుపై పడేశారు. చీకటి కావడంతో ఓ ట్రక్ ఆ మహిళ మృతదేహంపై నుంచి వెళ్లిపోయింది. దీంతో ట్రక్ ఢీకొట్టడం వల్లే మోనిక చనిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే పోస్ట్‌మార్టమ్‌లో మాత్రం ఊపిరి ఆడక చనిపోయినట్టు బయటపడింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మోనిక ప్రియుడు చరణ్ గురించి తెలుసుకుని అతడిని తమదైన శైలిలో విచారించారు. విచారణలో చరణ్ నిజం అంగీకరించాడు.

Updated Date - 2023-01-23T15:56:04+05:30 IST