ఇద్దరు యువకులను నగ్నంగా మార్చి చితక్కొట్టిన గ్రామస్థులు.. ఇంతకీ వారేం చేశారంటే..

ABN , First Publish Date - 2023-01-29T20:14:25+05:30 IST

హర్యానాలోని యమునా నగర్‌లో ఇద్దరు యువకులను గ్రామస్థులు చితక్కొట్టారు. గ్రామ శివార్లలో ఉన్న చెరుకు తోటలో వారు చేస్తున్నదేంటో చూసి వారిని నగ్నంగా మార్చి కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

ఇద్దరు యువకులను నగ్నంగా మార్చి చితక్కొట్టిన గ్రామస్థులు.. ఇంతకీ వారేం చేశారంటే..

హర్యానాలోని (Haryana) యమునా నగర్‌లో ఇద్దరు యువకులను గ్రామస్థులు చితక్కొట్టారు. గ్రామ శివార్లలో ఉన్న చెరుకు తోటలో వారు చేస్తున్నదేంటో చూసి వారిని నగ్నంగా మార్చి కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. వారిద్దరూ సమీప గ్రామాల్లోని యువతకు డ్రగ్స్ సరఫరా (Drugs Smuggling) చేస్తున్నారు. శనివారం ఉదయం వారు చెరుకు తోటలో కూర్చుని గంజాయి పీలుస్తూ గ్రామస్థులకు దొరికారు (Crime News).

యమునానగర్‌కు సమీపంలోని హర్‌గఢ్ గ్రామానికి చెందిన ఆ యువకులిద్దరూ సమీప గ్రామాల్లోని యువకులకు చాలా కాలంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. శనివారం ఉదయం ఇద్దరు యువకులు సహకార బ్యాంకు సమీపంలోని చెరుకు తోటలో కూర్చుని గంజాయి తాగుతున్నారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడకు వెళ్లి వారిని పట్టుకున్నారు. వారిని నగ్నంగా మార్చి చితక్కొట్టారు. వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారి నుంచి డ్రగ్స్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. యువకులిద్దరినీ హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యసేవలందించారు.

Updated Date - 2023-01-29T20:14:31+05:30 IST