యూకో బ్యాంక్‌ లాభంలో రెండింతల వృద్ధి

ABN , First Publish Date - 2023-01-25T00:58:29+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో యూకో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 110 శాతం వృద్ధి చెంది రూ.653 కోట్లుగా నమోదైంది...

యూకో బ్యాంక్‌ లాభంలో రెండింతల వృద్ధి

కోల్‌కతా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో యూకో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 110 శాతం వృద్ధి చెంది రూ.653 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయం పెరగటంతో పాటు మొండి బకాయిలు (ఎన్‌పీఏ) తగ్గటం ఎంతగానో కలిసివచ్చిందని బ్యాంక్‌ వెల్లడించింది. మార్చి త్రైమాసికంలో ఇదే జోరును కొనసాగించవచ్చని బ్యాంక్‌ అంచనా వేస్తోంది. 2021-22 డిసెంబరు త్రైమాసికంలో బ్యాంక్‌ లాభం రూ.310 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.4,638 కోట్ల నుంచి రూ.5,451 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో వడ్డీ ఆదాయం రూ.3,919 కోట్ల నుంచి రూ.4,627 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ పేర్కొంది. మరోవైపు స్థూల ఎన్‌పీఏలు 8 శాతం నుంచి 5.63 శాతానికి తగ్గగా నికర ఎన్‌పీఏలు 2.81 శాతం నుంచి 1.66 శాతానికి తగ్గాయి.

Updated Date - 2023-01-25T00:58:29+05:30 IST