లాభాల్లోకి టాటా మోటార్స్‌

ABN , First Publish Date - 2023-01-26T01:09:53+05:30 IST

టాటా మోటార్స్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.3,043కోట్ల నికర లాభాన్ని...

లాభాల్లోకి టాటా మోటార్స్‌

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.3,043కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ.1,451 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.72,229 కోట్ల నుంచి రూ.88,489 కోట్లకు పెరిగింది. స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.506 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సెమీ కండక్టర్‌ సరఫరాలు పెరగటం, ముడి పదార్ధాల ధరలు నిలకడగా ఉండటం ఎంతగానో కలిసివచ్చిందని టాటా మోటార్స్‌ పేర్కొంది. మరోవైపు జాగ్వార్‌ అండ్‌ లాండ్‌రోవర్‌ ఆదాయాలు కూడా 28 శాతం పెరిగి 600 కోట్ల పౌండ్లుగా ఉన్నట్లు తెలిపింది.

Updated Date - 2023-01-26T01:09:53+05:30 IST