డేటా ధరల పెరుగుదల ఆందోళనకరం

ABN , First Publish Date - 2023-01-26T01:11:23+05:30 IST

దేశంలో డేటాతో పాటు స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరుగుతుండటం ఆందోళనకరమని, శరవేగ డిజిటలీకరణకు అవి ఆటంకంగా మారవచ్చని...

డేటా ధరల పెరుగుదల ఆందోళనకరం

ట్రాయ్‌ని సంప్రదిస్తామన్న కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో డేటాతో పాటు స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరుగుతుండటం ఆందోళనకరమని, శరవేగ డిజిటలీకరణకు అవి ఆటంకంగా మారవచ్చని కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఈ విషయంపై ట్రాయ్‌తో చర్చిస్తామని, టారి్‌ఫల పెరుగుదలకు కారణాలను తెలుసుకుంటామని బుధవారం ఇండియా స్టాక్‌ డెవలపర్స్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సహా 8 సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌ కనీస రీచార్జ్‌ ధరను ఏకంగా రూ.155కు పెంచిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో 83 కోట్ల మంది ఆన్‌లైన్‌ సేవల ను వినియోగించుకుంటున్నారని, 2025 నాటికి ఈ సంఖ్యను 120 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Updated Date - 2023-01-26T01:11:25+05:30 IST