శ్రీసిటీ యూనిట్‌లో ఉత్పత్తి షురూ

ABN , First Publish Date - 2023-02-07T02:40:43+05:30 IST

బ్లూస్టార్‌కు చెందిన బ్లూస్టార్‌ క్లైమాటిక్‌ లిమిటెడ్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఏర్పాటు చేసిన యూనిట్‌లో వాణిజ్యపరంగా ఏసీల తయారీని ప్రారంభించింది...

శ్రీసిటీ యూనిట్‌లో ఉత్పత్తి షురూ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బ్లూస్టార్‌కు చెందిన బ్లూస్టార్‌ క్లైమాటిక్‌ లిమిటెడ్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఏర్పాటు చేసిన యూనిట్‌లో వాణిజ్యపరంగా ఏసీల తయారీని ప్రారంభించింది. దశలవారీగా ఈ ప్లాంట్‌పై రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టాలని బ్లూస్టార్‌ నిర్ణయించింది. ఇప్పటి వరకూ రూ.350 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు బ్లూస్టార్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బీ త్యాగరాజన్‌ తెలిపారు. ఈ ప్లాంట్‌లో మొదటి ఏడాది 3 లక్షల ఏసీలను తయారు చేయనున్నారు. అనంతరం దశల వారీగా 12 లక్షల యూనిట్లకు పెంచనున్నారు.

కొత్త ఏసీల విడుదల: వేసవి కాలం కోసం కొత్త ఏసీలను కూడా బ్లూస్టార్‌ సోమవారం విడుదల చేసింది. ఇన్వర్టర్‌, ఫిక్స్‌డ్‌ స్పీడ్‌, విండో ఏసీల విభాగాల్లో మొత్తం దాదాపు 75 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. కొత్తగా విడుదల చేసిన 3, 4 స్టార్‌ స్ల్పిట్‌ ఏసీల ధర రూ.29,990 నుంచి మొదలవుతుంది.

Updated Date - 2023-02-07T02:40:45+05:30 IST