పాన్‌-ఆధార్‌ అనుసంధానత 48 కోట్లు

ABN , First Publish Date - 2023-02-06T01:18:38+05:30 IST

దేశంలో ఇప్పటివరకు 48 కోట్ల మంది తమ పాన్‌, ఆధార్‌లను అనుసంధానం చేశారని సీబీడీటీ చైర్‌పర్సన్‌ నితిన్‌ గుప్తా తెలిపారు...

పాన్‌-ఆధార్‌ అనుసంధానత 48 కోట్లు

దేశంలో ఇప్పటివరకు 48 కోట్ల మంది తమ పాన్‌, ఆధార్‌లను అనుసంధానం చేశారని సీబీడీటీ చైర్‌పర్సన్‌ నితిన్‌ గుప్తా తెలిపారు. దేశంలో జారీ అయిన మొత్తం పాన్‌ల సంఖ్య 61 కోట్లు. మిగతా 18 కోట్ల మంది కూడా నిర్దేశిత గడువు లోగా వాటిని అనుసంధానం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఈ రెండింటి అనుసంధాన తప్పనిసరి అని ఆదేశిస్తూ ఇందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు దాటిన తర్వాత ఆధార్‌తో అనుసంధానం కాని పాన్‌ కార్డులన్నీ పని చేయకుండా పోతాయి. గడువు తర్వాత పాన్‌-ఆధార్‌ అనుసంధానం చేయాలంటే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - 2023-02-06T01:18:43+05:30 IST