మారుతి సుజుకీ బ్రెజ్జా సీఎన్‌జీ

ABN , First Publish Date - 2023-03-18T01:19:43+05:30 IST

మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) మార్కెట్లోకి కాంపాక్ట్‌ ఎస్‌యూవీ బ్రెజ్జా సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేసింది....

మారుతి సుజుకీ బ్రెజ్జా సీఎన్‌జీ

న్యూఢిల్లీ: మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) మార్కెట్లోకి కాంపాక్ట్‌ ఎస్‌యూవీ బ్రెజ్జా సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.9.14 లక్షల నుంచి రూ.12.05 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బ్రెజ్జా ఎస్‌-సీఎన్‌జీ వెర్షన్‌.. 25.51 కిలో మీటర్ల (కిలో సీఎన్‌జీకి) మైలేజీ ఇస్తుందని తెలిపింది. కంపెనీ ఇప్పటికే ఎర్టిగా, వ్యాగన్‌ఆర్‌ మోడల్స్‌లో సీఎన్‌జీ వాహనాలను విక్రయిస్తోంది. కాగా కంపెనీ మొత్తం విక్రయాల్లో ఎస్‌-సీఎన్‌జీ వాహనాల వాటా 24 శాతంగా ఉందని పేర్కొంది.

Updated Date - 2023-03-18T01:19:43+05:30 IST