లాభాల్లో మారుతి జోరు

ABN , First Publish Date - 2023-01-25T00:56:57+05:30 IST

అమ్మకాల జోరుతో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా...

లాభాల్లో మారుతి జోరు

న్యూఢిల్లీ: అమ్మకాల జోరుతో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ ఐ) లాభం రెండు రెట్లు పెరిగి రూ.2,351.30 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.1,011.30 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీ క్షా కాలంలో అమ్మకాలు రూ.22,187.60 కోట్ల నుంచి రూ.27,849.20 కోట్లకు పెరిగాయి. క్యూ3లో కంపెనీ మొత్తం 4,65,911 కార్లు విక్రయించింది. 61,982 కార్ల ఎగుమతి కూడా ఇందులో భాగంగా ఉంది. గ్రాండ్‌ విటారా, బ్రెజ్జా కొత్త వెర్షన్ల విడుదల అమ్మకాల జోరును పెంచిందని కంపెనీ తెలిపింది. వ్యయ నియంత్రణ చర్యలు, అందుబాటులో ఉన్న సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, తగ్గిన కమోడిటీ ధరలు, నాన్‌-ఆపరేటింగ్‌ ఆదాయంలో పెరుగుదల కలిసివచ్చినట్టు వివరించింది. డిసెంబరు చివరి నాటికి పెండింగ్‌లో ఉన్న ఆర్డర్ల సంఖ్య 3,63,000 యూనిట్లుగా ఉంది. కాగా చిప్స్‌ కొరత కారణంగా త్రైమాసికం మొ త్తం మీద కార్ల ఉత్పత్తి 46 వేలు తగ్గినట్టు తెలిపింది.

Updated Date - 2023-01-25T00:56:59+05:30 IST