Stella Moto: దేశవ్యాప్త విస్తరణకు రంగం సిద్ధం చేసిన స్టెల్లా మోటో

ABN , First Publish Date - 2023-01-26T20:15:39+05:30 IST

మైక్రో మొబిలిటీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘జైద్కా గ్రూప్’(Jaidka Group)కు చెందిన స్టెల్లా మోటా(Stella Moto) దేశవ్యాప్త

Stella Moto: దేశవ్యాప్త విస్తరణకు రంగం సిద్ధం చేసిన స్టెల్లా మోటో

బెంగళూరు: మైక్రో మొబిలిటీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘జైద్కా గ్రూప్’(Jaidka Group)కు చెందిన స్టెల్లా మోటా(Stella Moto) దేశవ్యాప్త విస్తరణకు ప్రణాళికలు రచించింది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఢిల్లీలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, టయర్ 2, టయర్ 3 మార్కెట్లలో సైతం కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా డీలర్లను ఆకర్షించేందుకు దరఖాస్తుల ప్రక్రియను సరళీకృతం చేస్తూ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. దీనిద్వారా తమ వ్యాపార భాగస్వాములకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ అందించనుంది. అలాగే, మార్కెటింగ్ ద్వారా విద్యుత్ స్కూటర్ వ్యాపారాన్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పాటు అందించనుంది.

ఈ సందర్భంగా స్టెల్లా మోటో సీఈవో, వ్యవస్థాపకుడు నకుల్ జైద్కా మాట్లాడుతూ.. వినియోగదారులు, డీలర్ల నుంచి లభిస్తున్న ప్రోత్సాహమే విస్తరణకు కారణమన్నారు. అతి త్వరలోనే సేల్స్‌, పోస్ట్‌ సేల్స్‌ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడంతోపాటు వారి నమ్మకాన్ని చూరగొంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్టెల్లా మోటో ఇటీవలే ఆర్‌ఓటీ అనుమతించిన ఎలక్ట్రిక్ స్కూటర్ బజ్‌(Buzz)ను ప్రకటించింది. త్వరలోనే డెలివరీ టూ వీలర్ మోడల్‌ను సైతం విడుదల చేయనుంది. గ్రూప్ కంపెనీ అయిన జైద్కాకు హౌరా, మైసూరులో రెండు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటి సామర్థ్యం ఏడాదికి 20 వేల వాహనాలు. దీనికి లక్ష యూనిట్లకు పెంచాలని నిర్ణయించింది.

Updated Date - 2023-01-26T20:15:41+05:30 IST