ఇండియన్‌ అచీవర్స్‌ అవార్డులు

ABN , First Publish Date - 2023-01-27T04:13:42+05:30 IST

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పిఎంఏవై) కింద ‘వాసవి అర్బన్‌’ ప్రాజెక్టు - సామాజిక ఆరోగ్య రంగానికి అందించిన సేవల్లో భాగంగా అత్యధిక పీఆర్‌పీ చికిత్సలు నిర్వహించిన ఎపివన్‌ గ్రూప్‌ ఆఫ్‌ క్లినిక్స్‌...

ఇండియన్‌ అచీవర్స్‌ అవార్డులు

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పిఎంఏవై) కింద ‘వాసవి అర్బన్‌’ ప్రాజెక్టు నిర్మాణానికిగాను వాసవి గ్రూప్‌ చైర్మన్‌ ఎర్రం విజయ్‌ కుమార్‌కు ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ అచీవర్స్‌ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని ఎన్‌డీఎంసీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా విజయ్‌ కుమార్‌ ఈ అవార్డును అందుకున్నారు.

సామాజిక ఆరోగ్య రంగానికి అందించిన సేవల్లో భాగంగా అత్యధిక పీఆర్‌పీ చికిత్సలు నిర్వహించిన ఎపివన్‌ గ్రూప్‌ ఆఫ్‌ క్లినిక్స్‌ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర్‌ దారాకు పవర్‌ కారిడార్‌ ఇండియన్‌ అచీవర్స్‌ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా డాక్టర్‌ సుధీర్‌ ఈ అవార్డును అందుకున్నారు.

Updated Date - 2023-01-27T04:13:43+05:30 IST