భారీగా తగ్గిన వెండి

ABN , First Publish Date - 2023-02-07T02:48:52+05:30 IST

దేశంలో విలువైన లోహాల ధరలు దిగివచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ.574 తగ్గి రూ.57,155కు జారుకుంది...

భారీగా తగ్గిన వెండి

దేశంలో విలువైన లోహాల ధరలు దిగివచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ.574 తగ్గి రూ.57,155కు జారుకుంది. కిలో వెండి ఏకంగా రూ.2,113 తగ్గి రూ.68,133కు పరిమితమైంది. అంతర్జాతీయంగా వీటి రేట్లు తగ్గడం ఇందుకు కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ఒక దశలో 1,875 డాలర్లకు, సిల్వర్‌ 22.48 డాలర్లకు తగ్గాయి.

Updated Date - 2023-02-07T02:48:53+05:30 IST