Gold and Silver Price: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు..లేటెస్ట్ రేట్లు ఇవే..

ABN , First Publish Date - 2023-02-05T09:16:05+05:30 IST

భారతీయులకు బంగారం ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ఎక్కువగా

Gold and Silver Price: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు..లేటెస్ట్ రేట్లు ఇవే..

Gold and Silver Price: భారతీయులకు బంగారం ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ఎక్కువగా ధరిస్తుంటారు. అయితే.. గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‎లో బంగారం, వెండి ధరలు(Gold prices) పరుగులు పెడుతున్నాయి. నేడు బంగారం,వెండి ధరలకు బ్రేక్ పడింది. ఒక్కసారిగా పరుగులు పెట్టిన బంగారం ,వెండి ధర ఇప్పుడు నెమ్మదించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్(22 carat gold rate) తులానికి రూ.700 మేర పడిపోయి రూ.52,400 మార్కుకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం(24 carat gold) ధర రూ.770కి పడిపోయి.. 10 గ్రాములకు రూ.57,160 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికి వస్తే.. నేడు భారీగా వెండి ధర(Silver Price) పతనమైంది. హైదరాబాద్ లో ఏకంగా రూ.1800 పడిపోయి రూ.74,200కు చేరింది. ఇక ఢిల్లీలో అయితే.. ఏకంగా రూ.2600 క్షీణించి ..ప్రస్తుతం రూ.71,200 వద్ద కొనసాగుతోంది. రెండు రోజులలో రూ.3500 తగ్గింది. దేశంలోని ప్రధానమైన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు

హైదరాబాద్‎లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ (10 గ్రాములు) రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 57,160 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 57,160 కొనసాగుతోంది.

విశాఖలో 22 క్యారెట్ల గోల్డ్ ధర (10 గ్రాములు) రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 57,160గా ఉంది.

ప్రధానమైన నగరాల్లో

ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర (10 గ్రాములు) రూ.52,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 57,300గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర (10 గ్రాములు) రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 57,160 కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర (10 గ్రాములు) రూ.53,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 58,200 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర (10 గ్రాములు) రూ.52,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 57,210 కొనసాగుతోంది

కోల్‎కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 57,160 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 57,160 కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,200

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200

ముంబైలో కిలో వెండి ధర రూ.71,200

బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,200

హైదరాబాద్‎లో కిలో వెండి ధర రూ.74,200

విశాఖ‎లో కిలో వెండి ధర రూ.74,200

విజయవాడలో కిలో వెండి ధర రూ.74,200 లుగా కొనసాగుతోంది.

Updated Date - 2023-02-05T09:17:35+05:30 IST