శుద్ధ ఇంధనాలకు పెద్దపీట

ABN , First Publish Date - 2023-02-02T03:37:29+05:30 IST

దేశంలో శుద్ధ ఇంధన వినియోగంతోపాటు కర్బన రహిత లక్ష్యాల సాధన కోసం రూ. 35,000 కోట్ల కేటాయింపులు జరుపుతున్నట్లు బడ్జెట్లో మంత్రి సీతారామన్‌ ప్రకటించారు...

శుద్ధ ఇంధనాలకు పెద్దపీట

  • ఇంధన పరివర్తనం, కర్బన రహిత లక్ష్యాల కోసం రూ.35,000 కోట్లు

దేశంలో శుద్ధ ఇంధన వినియోగంతోపాటు కర్బన రహిత లక్ష్యాల సాధన కోసం రూ. 35,000 కోట్ల కేటాయింపులు జరుపుతున్నట్లు బడ్జెట్లో మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. అంతేకాదు, ప్రభుత్వ 7 ప్రాధాన్యాల్లో హరిత వృద్ధిని ఒకటిగా బడ్జెట్లో ప్రస్తావించారు. 2070 నాటికి భారత్‌ కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2021 నవంబరులో ప్రకటించారు. అంతేకాదు, 2030 నాటికి శుద్ధ ఇంధన ఉత్పత్తి సామర్థ్య లక్ష్యాన్ని 450 గిగావాట్ల నుంచి 500 గిగావాట్లకు పెంచారు. కేంద్ర ప్రభుత్వం రూ.19,700 కోట్లతో నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ను సైతం ఈమధ్యనే ప్రారంభించిన విషయాన్ని కూడా మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. 2030 నాటికి గ్రీన్‌ హైడ్రోజన్‌ (హరిత ఉదజని) ఉత్పత్తి వార్షిక సామర్థ్యాన్ని 5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Updated Date - 2023-02-02T03:37:31+05:30 IST