ఫెడ్‌ ‘పావు’ వడ్డింపు

ABN , First Publish Date - 2023-02-02T03:16:25+05:30 IST

అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను మరో పావు శాతం (0.25ు) పెంచింది...

ఫెడ్‌ ‘పావు’ వడ్డింపు

న్యూయార్క్‌: అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను మరో పావు శాతం (0.25ు) పెంచింది. దాంతో ఫెడరల్‌ ఫండ్‌ రేట్ల శ్రేణి 4.5-4.75 శాతానికి చేరుకుంది. 2007 అక్టోబరు తర్వాత గరిష్ఠ స్థాయిది. అంతేకాదు, 2022 మార్చి నుంచి ఫెడ్‌ రేట్ల ను పెంచడం వరుసగా ఇది ఎనిమిదోసారి. గత వడ్డింపులతో పోలిస్తే మాత్రం రేట్ల పెంపు తీవ్రతను తగ్గించింది. 40 ఏళ్ల రికార్డు స్థాయికి చేరిన ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకు ఫెడ్‌ రిజర్వ్‌ గత సమీక్షల్లో వడ్డీ రేట్లను 0.75 శాతం చొప్పున పెంచుతూ వచ్చింది.

Updated Date - 2023-02-02T03:16:28+05:30 IST