ఆర్‌బీఐ, క్యూ3 ఫలితాలతోనే దిశ!

ABN , First Publish Date - 2023-02-06T01:27:27+05:30 IST

ఈ వారం మార్కెట్ల గమనం వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయంతో పాటు కార్పొరేట్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపైనే ఆధారపడి ఉంది. అలాగే క్రూడాయిల్‌ ధరలు...

ఆర్‌బీఐ, క్యూ3 ఫలితాలతోనే దిశ!

ఈ వారం మార్కెట్ల గమనం వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయంతో పాటు కార్పొరేట్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపైనే ఆధారపడి ఉంది. అలాగే క్రూడాయిల్‌ ధరలు, డాలర్‌ మారకంలో రూపాయి గమనం కూడా ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. గత వారం అదానీ గ్రూప్‌నకు సంబంధించిన వార్తలు పూర్తిగా మార్కెట్‌ను ఆటుపోట్లకు గురి చేశాయి. ఈ వారం కూడా ఇవి కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ వారం నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌ను కనబరిస్తే 17600 దగ్గర మద్దతు స్థాయిలుండే అవకాశం ఉంది. ఒకవేళ మరింత డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తే 17400-17300 స్థాయిలకు పడిపోయే చాన్సుంది. ఇది 200 రోజుల ఎస్‌ఎంఏ స్థాయి. నిఫ్టీ నిలదొక్కుకుని అప్‌ట్రెండ్‌లో సాగితే మాత్రం 18000-18100 స్థాయిలను అధిగమించే వీలుంది. ట్రేడర్లు.. దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకు సాగటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం): గత కొద్ది వారాలుగా ఆటోమొబైల్‌ విభాగం పూర్తిగా నిస్తేజంగా సాగుతూ వస్తోంది. అయితే ఈ షేరు కూడా అదే ట్రెండ్‌ను కనబరుస్తూ వస్తున్నప్పటికీ గత శుక్రవారం మాత్రం అప్‌వార్డ్‌ డైరెక్షన్‌లోకి అడుగుపెట్టింది. వీక్లీ క్లోజింగ్‌ ప్రాతిపదికన చూస్తే ఈ షేరు కొత్త రికార్డుల దిశగా సాగే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1,388 వద్ద క్లోజైన ఈ షేరును రూ.1,460 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,348 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

అశోక్‌ లేలాండ్‌: కొద్ది వారాలుగా ఈ షేరు మంచి పనితీరును కనబరుస్తూ వస్తోంది. గడచిన మూడు నెలలుగా 200 రోజుల ఎస్‌ఎంఏ వద్ద నిలకడగా సాగుతూ వస్తున్న ఈ షేరు ధర ప్యాట్రన్‌ ప్రకారం మంచి వృద్ధిని కనబరిచింది. గత శుక్రవారం క్లోజింగ్‌ ప్రాతిపదికన ఇటీవలి అడ్డంకులను అధిగమించి బ్రేకౌట్‌ సాధించింది. రానున్న రోజుల్లో ఈ షేరులో అప్‌ట్రెండ్‌ కొనసాగే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.153.90 వద్ద క్లోజైన ఈ షేరును స్వల్ప కాలానికి రూ.162 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.149 స్థాయిని మాత్రం స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలిస్ట్‌, టెక్నికల్‌,

డెరివేటివ్స్‌, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - 2023-02-06T01:27:29+05:30 IST