3% పెరిగిన బజాజ్‌ ఆటో లాభం

ABN , First Publish Date - 2023-01-26T01:04:22+05:30 IST

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బజాజ్‌ ఆటో రూ.1,473 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

3% పెరిగిన బజాజ్‌ ఆటో లాభం

న్యూఢిల్లీ: డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బజాజ్‌ ఆటో రూ.1,473 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 3ు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయాలు రూ.9,022 కోట్ల నుంచి రూ.9,319 కోట్లకు పెరిగాయి. త్రైమాసిక కాలంలో కంపెనీ దేశీయ విక్రయాలు 4 శాతం పెరగగా ఎగుమతులు మాత్రం 33 శాతం క్షీణించాయి.

Updated Date - 2023-01-26T01:04:22+05:30 IST