ఎయిర్టెల్ కనీస రీచార్జ్ రూ.155
ABN , First Publish Date - 2023-01-25T01:11:37+05:30 IST
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ సహా 8 సర్కిళ్లలో ఎయిర్టెల్ కనీస రీచార్జ్ ధరను భారీగా పెంచింది...

ఏపీ సహా 8 సర్కిళ్లలో
28 రోజుల ప్లాన్ టారిఫ్ 57% పెంపు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ సహా 8 సర్కిళ్లలో ఎయిర్టెల్ కనీస రీచార్జ్ ధరను భారీగా పెంచింది. 28 రోజుల ప్లాన్ కనీస టారి్‌ఫను ఏకంగా 57 శాతం పెంచడంతో రూ.155కు చేరుకుంది. అంతేకాదు, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న రూ.99 కనీస రీచార్జ్ ప్లాన్‌ను నిలిపివేసింది. రూ.99 ప్లాన్‌లో కంపెనీ 200 ఎంబీ డేటాతో పాటు సెకనుకు 2.5 పైసల చొప్పున కాలింగ్ సేవలందించేది. గత ఏడాది నవంబరులోనే ఎయిర్టెల్ హరియాణ, ఒడిశా సర్కిళ్లలో కనీస మంత్లీ రీచార్జ్‌ను రూ.155కు పెంచింది. తాజాగా మరో ఎనిమిది సర్కిళ్లలో పెంచేసింది. ఈ జాబితాలో జమ్ము-కశ్మీర్, రాజస్థాన్, ఈశాన్యం, హిమాచల్ ప్రదేశ్ సర్కిళ్లు కూడా ఉన్నాయి. రూ.155 కనీస రీచార్జ్‌ను కంపెనీ క్రమంగా అన్ని సర్కిళ్లలో ప్రవేశపెట్టనుందని తెలిసింది. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత కాలింగ్‌తో పాటు ఒక జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎ్‌సలను అందిస్తోంది.