గ్రాన్యూల్స్‌ లాభంలో 23% వృద్ధి

ABN , First Publish Date - 2023-01-25T01:01:11+05:30 IST

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో గ్రాన్యూల్స్‌ ఇండియా ఏకీకృత ప్రాతిపదికన రూ.124 కోట్ల నికర లాభాన్ని...

గ్రాన్యూల్స్‌ లాభంలో 23% వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో గ్రాన్యూల్స్‌ ఇండియా ఏకీకృత ప్రాతిపదికన రూ.124 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.101 కోట్లతో పోలిస్తే 23 శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం కూడా 15 శాతం వృద్ధితో రూ.997 కోట్ల నుంచి రూ.1,146 కోట్లకు చేరినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి తెలిపారు. అమెరికాలో పారాసిటమాల్‌ ఏపీఐ విక్రయాలు పెరగడం ఆదాయం పెరగడానికి ప్రధాన కారణమని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మొత్తం ఆదాయంలో అమెరికా ఆదాయ వాటా 43.1 శాతం నుంచి 49.4 శాతానికి పెరిగింది. మొత్తం ఆదాయంలో ఏపీఐ విభాగం వాటా 35.8ు, పినిష్డ్‌ డోసేజీల వాటా 45.6 శాతం ఉంది.

Updated Date - 2023-01-25T01:01:11+05:30 IST