కలెక్టర్‌ ప్రశాంతికి రాష్ట్రస్థాయి అవార్డు

ABN , First Publish Date - 2023-01-25T00:35:35+05:30 IST

జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతికి రాష్ట్రస్థాయి బెస్ట్‌ అవార్డు లభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎలకో్ట్రలర్‌ ప్రాక్టీస్‌ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రకటించారు.

కలెక్టర్‌ ప్రశాంతికి రాష్ట్రస్థాయి అవార్డు

భీమవరం/ నరసాపురం, జనవరి 24 : జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతికి రాష్ట్రస్థాయి బెస్ట్‌ అవార్డు లభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎలకో్ట్రలర్‌ ప్రాక్టీస్‌ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రకటించారు. ఈ అవార్డును 13వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా 25వ తేదీ బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అందజేస్తారు. ఓటరు చైతన్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన ముగ్గురు కలెక్టర్లలో మన జిల్లా కలెక్టర్‌ కూడా ఉన్నారు.

పీచుపాలెం సచివాలయం వెల్ఫేర్‌ సెక్రటరీకి..

అదేవిధంగా నరసాపురంలోని పీచుపాలెం సచివాలయంలో వెల్ఫేర్‌ సెక్రటరీగా పని చేస్తున్న ఎం.జయలక్ష్మి రాష్ట్రస్థాయిలో ఎలకో్ట్రలర్‌ ప్రాక్టీస్‌ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఉద్యోగంలో చేరి మూడేళ్లయింది. తక్కువ కాలంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల విధుల్లో పడ్డ కష్టానికి గుర్తింపు వచ్చింది. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది’ అని పేర్కొంది.

–––––––––––––

Updated Date - 2023-01-25T00:35:35+05:30 IST