యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-02-07T00:06:50+05:30 IST

జిల్లాలో యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌

ఏలూరు టూటౌన్‌, ఫిబ్రవరి 6: జిల్లాలో యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. అన్నేభవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొసైటీ, రైతు భరోసా కేంద్రాలలో తగినంత యూరియా అందుబాటులో లేకపోవడం వలన రైతు లు ఇబ్బందులుపడుతున్నారన్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఖరీఫ్‌ ధాన్యం బకాయిలు రైతులకు వెంటనే చెల్లించాలన్నారు. నష్టాల్లో కూరుకుపోతున్న పౌల్ర్టీ రైతులను ఆదుకోవాలని అన్నారు. రైతులను ఆదుకోవాలన్నారు. ఫీడ్‌ ధర పౌల్ర్టీ రైతులు నష్టపోతున్నారన్నారు. రాజ, ఎం.శేషగిరిరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:06:51+05:30 IST