ఇద్దరు బంగారం దొంగలు అరెస్టు

ABN , First Publish Date - 2023-02-06T23:49:39+05:30 IST

పాలకొల్లు కేంద్రంగా బంగారం నగలు చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి 63.5 కాసుల బంగార నగలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ రవి ప్రకాష్‌ తెలిపారు

ఇద్దరు బంగారం దొంగలు అరెస్టు
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ రవి ప్రకాష్‌

63.5 కాసుల ఆభరణాలు స్వాధీనం

పాలకొల్లు రూరల్‌ / పాలకొల్లు అర్బన్‌, ఫిబ్రవరి 6 : పాలకొల్లు కేంద్రంగా బంగారం నగలు చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి 63.5 కాసుల బంగార నగలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ రవి ప్రకాష్‌ తెలిపారు.పట్టణ పోలీసుస్టేషన్‌లో సోమవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పాలకొల్లు–వరిధనం రోడ్డులో ఇటీవల వాకింగ్‌ చేస్తున్న ఇద్దరు మహిళలో ఒక మహిళ మెడలో బంగారం గొలుసు చోరీ చేసిన సంఘటనలో సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెంచామన్నారు. నరసాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి ఎదురుగా రోడ్డుపక్కన పండ్లు, చెరుకు గెడలు అమ్మే షాపు వద్ద అను మానస్పదంగా ఉన్న నిందితులను పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు గుర్తించి విచారించగా చోరీలు చేసినట్టుగా అంగీకరించడంతో అరెస్టు చేసినట్టు తెలి పారు.భీమవరం మండలం వెంప గ్రామానికి చెందిన దేవరపు నాగేశ్వరరావు (నాని), బొక్కా లక్ష్మీనారాయణ (నరేష్‌)లను అరెస్టు చేసినట్టు తెలిపారు. జిల్లాలో నరసాపురం, మొగల్తూరు, భీమవరం పట్టణం, వీరవాసరం, పెను మంట్ర, తణుకు తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్టు అంగీకరించార తెలిపారు. వారి నుంచి మూడు మోటారు బైక్‌లు, 63.5 కాసుల బంగారం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నరసాపురం డీఎస్పీ కె.రవి మనోహరాచారి, పాలకొల్లు పట్టణ ఎస్‌ఐలు శ్రీనివాస్‌, ఎస్‌ఎన్‌ ముత్యా లరావు, సిబ్బంది నిందితులను పట్టుకున్నట్టు ఎస్పీ తెలిపారు. సిబ్బందిని ఎస్‌ిస్పీ అభినందించారు.

Updated Date - 2023-02-06T23:49:41+05:30 IST