నేటి నుంచి లారీలు బంద్‌

ABN , First Publish Date - 2023-02-06T23:42:01+05:30 IST

నేటి నుంచి జిల్లాలో క్వారీ లారీలు నిలిచిపోనున్నాయి. సమ్మె పాటిస్తున్నట్లు గోదావరి క్వారీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రావూరి రాజా తెలిపారు.

నేటి నుంచి లారీలు బంద్‌

ఉమ్మడి జిల్లాలో నిలిచిపోనున్న వెయ్యి క్వారీ లారీలు

జేపీ సంస్థ హామీ నెరవేర్చకపోవడంతోనే సమ్మెకు..

అసోసియేషన్‌ అధ్యక్షుడు రావూరి రాజా

పాలకొల్లు, ఫిబ్రవరి 6: నేటి నుంచి జిల్లాలో క్వారీ లారీలు నిలిచిపోనున్నాయి. సమ్మె పాటిస్తున్నట్లు గోదావరి క్వారీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రావూరి రాజా తెలిపారు. ఇటీవల జేపీ సంస్థ ప్రతినిధులకు లారీ అసోసియేషన్‌ నాయకులకు మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలలో ఇసుక ర్యాంపులలో బాట చార్జీలు మినహాయిస్తామని లారీలు అక్రమ కేసులు బనా యించకుండా చూస్తామని జేపీ సంస్థ హామీ ఇచ్చిన్పటికి హామీకి కట్టుబడి ఉండలేదని ఈ కారణంగా సమ్మె అనివార్యమైందని రాజా తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇసుక, కంకర సరఫరా చేసే టిప్పర్‌ లారీలు సుమారు రెండువేల వరకు ఉన్నాయి. సుమారు వెయ్యి లారీలు నిత్యం ఇసుక, కంకర సరఫరా చేస్తాయి. అయితే జిల్లాలోని ఇసుక ర్యాంపులలో అధిక ధర చెల్లించనప్పటికి తగినంతగా కిరాయి రావడం లేదని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 3 యూనిట్లు ఇసుకకు ర్యాంపులో రూ. 4,750 చెల్లిస్తుండగా జిల్లాలో ఆయా ప్రాంతాలను బట్టి రూ. 7 వేల నుంచి 7,500 విక్రయిస్తున్నారు. ఐదు యూనిట్ల లారీకి ర్యాంపులో రూ. 8,550 రూపాయలు పాట, ఇతరత్రా ఖర్చులు నిమిత్తం రూ. 450 మొత్తం రూ. 9 వేలు చెల్లిస్తుండగా రూ. 12,500లకు అమ్మ కాలు జరుగుతున్నాయని ఈ మొత్తంలో ఇసుక కొనుగోలు వ్యయం తీసేస్తే మిగిలిన మొత్తం డీ జిల్‌కు, డ్రైవర్‌ జీతానికి సరిపోవడం లేదని లారీ యజమానులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అనుమతులు లేని ర్యాంపులలో ఇసుక అమ్మకాలు జరుపుతున్నారని సరఫరా సమయంలో లారీలపై అక్రమకేసులు రాస్తున్నాని అసోసియేషన్‌ అగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇటీవల సిద్ధాంతంలో జరిగిన చర్చలలో జేపీ సంస్థ హామీ ఇచ్చినప్పటికి రెండు రోజులు కోడేరు ఇసుక ర్యాంప్‌లో అక్రమ కేసులు రాశారని ఈ పరిస్థితిలో సమ్మె అనివార్యమైందని యజమానులు చెబుతున్నారు. పూర్తిగా బాట చార్జీలు మినహాయించి అనుమతి లేని ఇసుక ర్యాంపులలో ఇసుక తవ్వకాలు నిలిపి వేయాలని అదేవిధంగా లారీలపై అక్రమ కేసులు బనాయించకుండా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్‌ డిమాండ్‌ చేసూ నిరవధి సమ్మెకు దిగినట్లు తెలిపారు.

Updated Date - 2023-02-06T23:42:03+05:30 IST