యువగళం విజయవంతం కావాలంటూ బైక్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2023-01-26T00:05:29+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధా న కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ కామవరపుకోట నుంచి టీడీపీ నాయకు లు, కార్యకర్తలు బుధవారం ద్వారకా తిరుమలకు బైక్‌ ర్యాలీగా తరలివెళ్ళారు.

యువగళం విజయవంతం కావాలంటూ బైక్‌ ర్యాలీ
చిన వెంకన్న ఆలయానికి చేరుకున్న చింతలపూడి నియోజకవర్గ నేతలు

కామవరపుకోట / ద్వారకా తిరుమల, జనవరి 25: టీడీపీ జాతీయ ప్రధా న కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ కామవరపుకోట నుంచి టీడీపీ నాయకు లు, కార్యకర్తలు బుధవారం ద్వారకా తిరుమలకు బైక్‌ ర్యాలీగా తరలివెళ్ళారు. ర్యాలీని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ ప్రారంభించారు. 400 రోజులపాటు నాలుగువేల కిలోమీటర్ల మేర పాదయాత్ర ఎటువంటి ఆటంకా లు కలుగకుండా చూడాలని వేంకటేశ్వరస్వామిని మొక్కుకున్నారు. కార్యక్ర మంలో మాజీ మంత్రి పీతల సుజాత, గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్‌ మద్దిపాటి వెంకటరాజు, కిలారు సత్యనారాయణ, ఘంటా సుధీర్‌బాబు, సొం గా రోషన్‌కుమార్‌, ఆకుమర్తి రామారావు, తూతా లక్ష్మణరావు, పసుమర్తి పార్థసారధిబాబు, వేముల నాగేశ్వరరావు, గోరింక దాసు, గూడపాటి కేశవ రావు, లంకా సత్యనారాయణ, డీవీఎస్‌ చౌదరి, కార్యకర్తలు పాల్గొన్నారు.

కుప్పం బయల్దేరిన నాయకులు

జంగారెడ్డిగూడెం, జనవరి 25: రైతులు, మహిళలు, యువత, విద్యార్థి, నిరుద్యోగులు, కార్మిక, ఉద్యోగులు, ప్రతీ ఒక్కరికి అండగా ఉండేందుకు నారా లోకేశ్‌ 4వేల కిలోమీటర్లు చేపట్టబోతున్న పాదయాత్ర ప్రజల్లో దైర్యాన్ని, చైతన్యాన్ని నింపుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్‌ దాసరి శ్యామ్‌ చంద్రశేషు, కొత్త నాగేంద్రబాబు, బీసీ సెల్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రవి కొండపల్లి అన్నారు. లోకేశ్‌ యువగళం పాదయాత్రకు ఆహ్వానం అందుకున్న నేతలు బుధవారం కుప్పం బయల్దేరి వెళ్లారు. ఈ పాదయాత్ర రాబోయే రోజుల్లో టీడీపీ విజయ యాత్రగా మారుతుందన్నారు. ప్రజలందరూ యువగళానికి మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు బూస సత్యనారాయణ, ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి తాళ్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పోలవరం: లోకేశ్‌ చేపట్టనున్న పాదయాత్రలో పాల్గొనడానికి టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్ళారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడానికి టీడీపీ యువ నాయకులు నారా లోకేశ్‌ చేపట్టనున్న పాదయాత్రకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు, ప్రజలు సంఘీభావం తెలపాలన్నారు. యువగళం యాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2023-01-26T00:05:29+05:30 IST