Share News

కళ్లు తెరువు జగన్‌

ABN , First Publish Date - 2023-11-20T00:10:22+05:30 IST

రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పోలవరం నియోజవర్గ టీడీపీ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌, జనసేన నియోజకవర్గ కన్వీనర్‌ చిర్రి బాలరాజు విమర్శించారు.

కళ్లు తెరువు జగన్‌
బయ్యన్నగూడెం, సరిపల్లె రహదారిలో టీడీపీ, జనసేన నాయకుల నిరసన,

రహదారి గుంతలపై టీడీపీ, జనసేన నిరసన

కొయ్యలగూడెం, నవంబరు 19 : రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పోలవరం నియోజవర్గ టీడీపీ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌, జనసేన నియోజకవర్గ కన్వీనర్‌ చిర్రి బాలరాజు విమర్శించారు. ఆదివారం మండలంలోని బయ్యన్నగూడెం నుంచి సరిపల్లె వెళ్లే రహదారి అధ్వానంగా ఉండడంతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌ కళ్లు తెరవాలని, ఈ రహదారుల్లో తట్టెడు మట్టి కూడా వెయ్యలేని స్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రభుత్వం మొద్దు నిద్రవీడి రోడ్లు అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జాతీయ రహదారులు తప్ప పలు రాష్ట్ర రహదారులన్నీ సక్రమంగా లేవని విమర్శించారు. ఇకపై రాష్ట్రంలో టీడీపీ, జనసేన ఉమ్మడి పోరుతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు నరేష్‌, జనసేన మండల అధ్యక్షుడు తోట రవి, సరిపల్లె సర్పంచ్‌ గోపి, బెల్లాని శ్రీను, మల్లిపూడి శంకర్‌, అప్పన ప్రసాద్‌, తేజ, బాలం గంగాధరం, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రాకు దారేది..

చింతలపూడి, నవంబరు 19 : చింతలపూడి మండలం తెలంగాణ సరిహద్దు లింగగూడెం వద్ద రోడ్ల సమస్యపై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. కొద్దిసేపు నినాదాలు చేశారు. ధర్నాలో నియోజకవర్గ ఐటీడీపీ కన్వీనర్‌ బోడా అనీష్‌కుమార్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు గోతులతో ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ఐదేళ్లుగా ఈ రోడ్లతోనే జనం నరకం అనుభవిస్తున్నారని, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా తెలంగాణ రోడ్లు బాగుపడితే సరిహద్దులో ఉన్న ఆంధ్రారోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు. ప్రమాదాలకు నిలయంగా మారాయని, వచ్చీ వెళ్లే ప్రయాణికులు ఆంధ్రాకు దారేదని సరిహద్దులోని ప్రజలను అడుగుతు న్నారన్నారు. పల్లె శ్రీను మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే ప్రజలు నిలదీయడం ఖాయమ న్నారు. పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T00:10:40+05:30 IST