భవిత కేంద్రం తనిఖీ
ABN , First Publish Date - 2023-01-26T00:16:42+05:30 IST
కొణితివాడ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న భవిత (దివ్యాంగుల) కేంద్రాన్ని రాష్ట్ర ప్రత్యేక విద్య కో–ఆర్టినేటర్ ఎన్కె అన్నపూర్ణ బుధవారం తనిఖీ చేశారు.

వీరవాసరం, జనవరి 25: కొణితివాడ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న భవిత (దివ్యాంగుల) కేంద్రాన్ని రాష్ట్ర ప్రత్యేక విద్య కో–ఆర్టినేటర్ ఎన్కె అన్నపూర్ణ బుధవారం తనిఖీ చేశారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేశారు. ప్రత్యేక విద్య అమలు తీరును పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు వివరించారు. ఆమెతో పాటు జిల్లా ఏపీవో పి. శ్యాంసుందర్, హెచ్ఎం బాజింకి కృష్ణారావు, ఎం.రాజబాబు, పి.కెనడీ పాల్గొన్నారు.