30న ఏలూరుకు ప్రత్యేక హోదా సమర యాత్ర

ABN , First Publish Date - 2023-01-25T23:57:00+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీ ల సాదనకై చేపట్టిన విద్యార్థి, యువజన సంఘాల సమరయాత్రను విజయవంతం చేయాలని వివిధ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

30న ఏలూరుకు ప్రత్యేక హోదా సమర యాత్ర
విద్యార్థి సంఘాల నేతల సంఘీభావం

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీ ల సాదనకై చేపట్టిన విద్యార్థి, యువజన సంఘాల సమరయాత్రను విజయవంతం చేయాలని వివిధ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఏలూరులో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 4 వరకు నిర్వహిస్తోన్న హిందూపురం–ఇచ్చాపురం బస్సుయాత్రపై చర్చించారు. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌ నాయకులు కె.నాని, లెనిన్‌, హేమశంకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు వైసీపీ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పిందని, అధికారంలోకి రాగానే రాష్ట్రాని కి రావాల్సిన విభజన హామీలను విస్మరించిందని దుమ్మెత్తి పోశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించా లని డిమాండ్‌ చేశారు. గిరిజన, సెంట్రల్‌, మైనింగ్‌ యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు. డిమాండ్ల సాధనకై చేపట్టిన బస్సుయాత్ర ఈ నెల 30న ఏలూరు చేరుకుంటుందన్నారు. 31న ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్లో బహిరంగ సభ ఉంటుందన్నారు. సమరయాత్రకు అధికసంఖ్యలో విద్యార్థులు, యువకులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తరలిరావాలన్నారు. సమావేశంలో దస్తగిరి, క్రాంతి, శివ, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:57:00+05:30 IST