రేషన్‌లో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం

ABN , First Publish Date - 2023-09-20T00:38:01+05:30 IST

ద్వారకాతిరుమల కొమ్మరలో తాజాగా ఇచ్చిన రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం రావడం కలకలాన్ని రేపింది.

రేషన్‌లో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం

ద్వారకాతిరుమల, సెప్టెంబరు 19: ద్వారకాతిరుమల కొమ్మరలో తాజాగా ఇచ్చిన రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం రావడం కలకలాన్ని రేపింది. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించకుండా ఇటువంటి బియ్యాన్ని పంపిణీ చేయడం సమంజసం కాదని స్థానికులు అంటు న్నారు. గ్రామానికి చెందిన అంజలి నాలుగు రోజుల క్రితం తీసుకున్న రేషన్‌ బియ్యం వండితే తింటున్నప్పుడు సాగు తున్నట్లు గమనించింది. దీంతో బియ్యంలో పెద్దగా ఉన్న బియ్యపు గింజలను వేరుచేసి అగ్గిపుల్లతో వెలిగిస్తే కాలిపోవడంతో అవాక్కయింది. చుట్టుపక్కల వారికి చూపింది. దీంతో వారంతా ఖంగుతిని తమ ఇళ్లలో బియ్యాన్ని కూడా పరిశీలించి తేడాను గమనించారు. దీనిపై సివిల్‌ సప్లైస్‌ డీటీఎం వెంకటేశ్వర రావు వివరణ ఇస్తూ..ఇవి కృత్తిమ బియ్యం అని వీటిని పోర్డుఫైడ్‌ రైస్‌గా పిలుస్తారన్నారు. ఇందులో విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయని వీటిని ప్రజలకు అందించేందుకు రేషన్‌ బియ్యంలో కలుపుతున్నట్లు చెప్పారు. అవగాహన లేకపోవడంతో అపోహ పడుతున్నారని ప్రమాదం ఏమీ కాదని వివరించారు.

Updated Date - 2023-09-20T00:38:01+05:30 IST