నన్నయ వర్సిటీ నెట్‌బాల్‌ విజేత ‘పెనుగొండ ఎస్‌వీకేపీ’

ABN , First Publish Date - 2023-01-25T23:38:24+05:30 IST

పెనుగొండ ఎస్‌వీకేపీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈనెల 18, 19 తేదీల్లో జరిగిన మూడో ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజీయేట్‌ నెట్‌ బాల్‌ పురుషులు, మహిళల పోటీలలో విజేతలకు బుధవారం బహుమతి ప్రదానం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైవీవీ అప్పారావు తెలిపారు.

నన్నయ వర్సిటీ నెట్‌బాల్‌ విజేత ‘పెనుగొండ ఎస్‌వీకేపీ’
పెనుగొండ కళాశాల జట్టు

పెనుగొండ, జనవరి 25 : పెనుగొండ ఎస్‌వీకేపీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈనెల 18, 19 తేదీల్లో జరిగిన మూడో ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజీయేట్‌ నెట్‌ బాల్‌ పురుషులు, మహిళల పోటీలలో విజేతలకు బుధవారం బహుమతి ప్రదానం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైవీవీ అప్పారావు తెలిపారు. బుధవారం కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నన్నయ వర్సిటీ ఇంటర్‌ కాలేజీయేట్‌ నెట్‌ బాల్‌ పురుషుల విజేతల్లో ప్రథమ స్థానం పెనుగొండ ఎస్‌వీకేపీ కళాశాల, ద్వితీయ స్థానం భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాల, తృతీయ స్థానం భీమవరం డాక్టర్‌ సీఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాల సాధించినట్టు తెలిపారు. ఆలిండియా ఇంటర్‌ వర్సిటీ నెట్‌ బాల్‌ పోటీలకు ఎంపికైన పురుషుల జట్టుకు ఎస్‌వీకేపీ డాక్టర్‌ కేఎస్‌రాజు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల పెనుగొండ, సీఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాల భీమవరం, కేజీఆర్‌ఎల్‌ డిగ్రీ కళాశాల భీమవరం, బీవీ రాజు డిగ్రీ కళాశాల భీమవరం, కాకినాడ పీఆర్‌ గవర్నమెంట్‌ కాలేజీల నుంచి క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. మహిళల జట్టుకు భీమవరం కేజీఆర్‌ఎల్‌ డిగ్రీ కళాశాల, భీమవ రం డీఎన్‌ఆర్‌ కళాశాల, భీమవరం వీఎస్‌కే డిగ్రీ కళాశాల, గోపన్నపాలెం ఎస్‌ఎస్‌ ఆర్‌జీసీపీ కళాశాల, పెనుగొండ ఎస్‌వీకేపీ కళాశాల, కాకినాడ ఏఎస్‌డీ కళాశాల, సూరంపాలెం ఆదిత్య డిగ్రీ కళాశాలల నుంచి క్రీడాకారిణులను ఎంపిక చేశామన్నారు.

Updated Date - 2023-01-25T23:38:24+05:30 IST