బాలికలకు విద్యతో సమాజ పురోగతి

ABN , First Publish Date - 2023-01-24T23:31:06+05:30 IST

బాలికలు విద్యావంతులు కావడం ద్వారా సమాజ పురోగతి సాధ్యమని పలువురు అన్నారు.

బాలికలకు విద్యతో సమాజ పురోగతి
ఉంగుటూరు మండలం కాగుపాడు పాఠశాల విద్యార్థినుల ర్యాలీ

జిల్లాలో బాలికా దినోత్సవ కార్యక్రమాలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 24: బాలికలు విద్యావంతులు కావడం ద్వారా సమాజ పురోగతి సాధ్యమని పలువురు అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లాలో పలుచోట్ల మంగళవారం అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. సెయింట్‌ థెరిస్సా మహిళా కళాశాల ఆడిటోరియంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల సుపీరియర్‌ సిస్టర్‌ మరియోట్టా పూదోట మాట్లాడుతూ బాలికలకు విద్య, హక్కులు, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై అవగాహనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మెర్సీ, అధ్యాపకులు ఎస్తేర్‌కళ్యాణి, రజని, మాధవి, జ్యోతికుమారి, వైస్‌ ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ రజిత, సిస్టర్‌ సుశీల, మేజర్‌ సెలీన్‌రోజ్‌ పాల్గొన్నారు.

సీఆర్‌రెడ్డి కళాశాల ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పీజీ కోర్సుల కరస్పాండెంట్‌ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలికల రక్షణతోపాటే వారి విద్యకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వాలని కోరారు. మహిళాసాధికారత విభాగం కోఆర్డినేటర్‌ హేమలత మాట్లాడుతూ బాలికల మధ్య అసమానతలను దూరంచేసేలా ప్రజల్లో అవగాహన కలిగిం చాలన్నారు. డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ విష్ణుమోహన్‌, ప్రిన్సిపాల్‌ రామరా జు, వీరభద్రరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోటదిబ్బలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ గిరిబాబు, అధ్యాపకులు ఉదయలక్ష్మి, పద్మావతి, కావ్యశ్రీ, కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు రూరల్‌: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ ఉన్నత పాఠశాలలో బాలికా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సీడబ్ల్యుసీ సభ్యులు పి.వెంకటేశ్వరరావు, ప్యానల్‌ లాయర్‌ జివి భాస్కర్‌ మాట్లాడుతూ బాలికల హక్కులు, వారి సంరక్షణ కోసం న్యాయసేవాధికార సంస్థలో కల్పిస్తున్న సహాయ సహకారాలపై వివరించారు.

ఉంగుటూరు: మండలంలోని నారాయణపురం మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ బీవీ.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాగుపాడు హైస్కూలులో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు శీతాల సత్యనారాయణ, పీహెచ్‌సీ వైద్యాధికారి అనూష, హెచ్‌ఎం ఉమాదేవి, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: పంగిడిగూడెం జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వం. పోటీలు నిర్వహించారు. తెలుగు టీచర్‌ మద్దిపాటి పెద్దిరాజు స్ర్తీ ఔన్నత్యాన్ని వివరించారు. సర్పంచ్‌ మహలక్ష్ముడు, హెచ్‌ఎం లీలాకుమార్‌, మహ్మద్‌ ససీమా, కుమారి, లక్ష్మి, పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:31:08+05:30 IST