శ్రీవారి సన్నిధిలో పెళ్లి సందడి

ABN , First Publish Date - 2023-02-02T00:02:25+05:30 IST

శ్రీవారి క్షేత్రంలో మాఘ మాసం పెళ్లిళ్ల సందడి ప్రారంభమైంది గత నెల 26 నుంచి ముహూర్తాలున్నప్పటికీ బుధ వారం మంచి ముహూర్తం ఉన్నట్టు పురోహితులు చెబుతున్నారు.

శ్రీవారి సన్నిధిలో పెళ్లి సందడి
ఆలయ అనివేటి మండపంలో జరుగుతున్న వివాహ వేడుక

శేషాచలం కొండపై రద్దీ

ద్వారకా తిరుమల, ఫిబ్రవరి 1 : శ్రీవారి క్షేత్రంలో మాఘ మాసం పెళ్లిళ్ల సందడి ప్రారంభమైంది గత నెల 26 నుంచి ముహూర్తాలున్నప్పటికీ బుధ వారం మంచి ముహూర్తం ఉన్నట్టు పురోహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 9.23 గంటల ముహూర్తానికి శేషాచల కొండపై వివాహాలు, ఉపనయనాలు జరిగాయి. రాత్రి 9 గంటల తర్వాత ముహూర్తా నికి కూడా అధిక సంఖ్యలో వివాహాలు జరిగాయి. రానున్న రెండు మూడు రోజులలో జరిగే వివాహాలకు పూల మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఉదయం పాత కల్యాణ మండపం, అనివేటి మండపం దేవస్థానం, ప్రైవేటు సత్రాలలో శుభకార్యాలు వైభవంగా జరిగాయి. పురోహితుల వేదమంత్రో చ్ఛరణల నడుమ పలు జంటలు మాంగల్యబంధంతో ఒక్కటయ్యారు. వివాహానంతరం వారంతా స్వామి, అమ్మవార్లను దర్శించారు. రాత్రి వేళ అధిక సంఖ్యలో పెళ్లిళ్లు కావడంతో ఆలయ ఆవరణ సందడిగా మారింది. జరిగాయి. వివాహ బృందాలతో పాటు దూరప్రాంతాల నుంచి తరలివచ్చే వారితో శేషాచలం కొండపై రద్దీ నెలకొంది.

Updated Date - 2023-02-02T00:02:27+05:30 IST