జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ప్రశాంతం

ABN , First Publish Date - 2023-01-26T00:06:57+05:30 IST

సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవే శానికి జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు మొదటి దశ బుధ వారం ప్రశాంతంగా జరి గాయి.

జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ప్రశాంతం
పెదతాడేపల్లి వాసవీలో పరిశీలించి పంపుతున్న పర్యవేక్షకులు

భీమవరం ఎడ్యుకేషన్‌/ తాడే పల్లిగూడెం రూరల్‌ జనవరి 25 : సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవే శానికి జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు మొదటి దశ బుధ వారం ప్రశాంతంగా జరి గాయి. జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాలలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించారు. భీమవరం డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో ఉదయం, మధ్యాహ్నం సెక్షన్‌లలో 200 మంది విద్యార్ధులకు 199 మంది పరీక్షకు హాజరయ్యారు. పెదతాడేపల్లి వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాలలో 220 మందికి 219 మంది, మధ్యాహ్నం 177 మందికి 174 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 99 మందికి 97 మంది, మధ్యాహ్నం 100 మందికి 98 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల నిర్వహణను టీసీఎస్‌ ప్రతినిధులు పర్యవేక్షించారు.

Updated Date - 2023-01-26T00:06:57+05:30 IST