హెపటైటిస్‌–బి వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2023-02-07T00:09:21+05:30 IST

హైరిస్క్‌తో జీవిస్తున్న వారికి, హెచ్‌ఐవీ వ్యాదిగ్రస్తులకు హెపటై టిస్‌–బి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సోమవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని ఏఆర్‌టీ కేంద్రంలో ప్రారంభించారు.

హెపటైటిస్‌–బి వ్యాక్సినేషన్‌
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వైద్యులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 6 : హైరిస్క్‌తో జీవిస్తున్న వారికి, హెచ్‌ఐవీ వ్యాదిగ్రస్తులకు హెపటై టిస్‌–బి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సోమవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని ఏఆర్‌టీ కేంద్రంలో ప్రారంభించారు. ఏపీ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణా మండలి(ఏపీసాక్స్‌), డాప్‌క్యూ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన వ్యాక్సినేషన్‌ నిమిత్తం ఏలూరు జిల్లాలో 7,784 మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 2,513 మందికి పరీక్ష చేసి హెపటైటిస్‌–బి సమస్య లేదని నిర్దారించామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ నాగేశ్వరరావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ మోహన్‌ వివరించారు. ఈ టీకాను గర్బిణులు, బాలింతలకు, ఇతర అవకాశవాద జబ్బుల తోవున్న వారందరికీ వేస్తున్నామన్నారు. అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ రత్నకుమారి, ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. వ్యాక్సినేషన్‌ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.

Updated Date - 2023-02-07T00:09:23+05:30 IST