ప్రతి అర్జీ పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-02-07T00:15:05+05:30 IST

స్పందనకు వచ్చే ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించాలి. ఆ దరఖాస్తు లు రీ ఓపెన్‌ కాకుండా సంతృప్తికర స్థాయిలో పరి ష్కరించాలి’ అని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు.

ప్రతి అర్జీ పరిష్కరించాలి
ఏలూరు కలెక్టరేట్‌ స్పందనలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

ఏలూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6 : స్పందనకు వచ్చే ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించాలి. ఆ దరఖాస్తు లు రీ ఓపెన్‌ కాకుండా సంతృప్తికర స్థాయిలో పరి ష్కరించాలి’ అని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో స్పందన నిర్వహించి ప్రజల నుంచి 204 దరఖా స్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కార విధానాన్ని, ఫొటోను స్పందన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు.

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య

‘తన కుమార్తె సెరిబ్రల్‌పాల్‌సీ వ్యాధితో బాధపడు తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కి అందించే పెన్షన్‌ అందించాలి’ అని ఉంగుటూరు మండలానికి చెందిన అన్నంరెడ్డి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

తమ భూమి ఆక్వా జోన్‌ పరిధిలో ఉందని, సాగు కు విద్యుత్‌ సబ్సిడీ అందించాలని గణపవరం మండలం సరిపల్లికి చెందిన నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

నూజివీడు నాసినచెరువులో వున్న ఆర్‌అండ్‌బీకి చెందిన 50 సెంట్ల భూమిని కొందరు ఆక్రమించి కట్టడాలు నిర్మిస్తున్నారని, వీటిని నిరోధించాలని పట్టణానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు.

వట్లూరు ఎస్సీ పేటలో డ్రెయిన్‌ నిర్మాణం సరిగా లేక మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు.

చక్రాయిగూడెం, సీతారాంపురం గ్రామాల్లో కొందరు పంట చెరువులను ఆక్రమించి సాగు చేస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.

ఈ వయసులో తనను కొడుకులు, కూతుళ్ళు పట్టించుకోవడం లేదని కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడానికి చెందిన వనచర్ల సత్యనారాయణ వాపోయారు. దీనికి ఏదొకటి చేయాలని కోరారు.

చేపల చెరువులు తవ్వుతూ.. తమ పొలాలకు వెళ్ళేందుకు దారి ఇవ్వడం లేదని భీమడోలు మండలం సాయన్నపాలానికి చెందిన వై.నాగ వేణుగోపాలరావు ఫిర్యాదుచేశారు.

తన తాతల కాలం నుంచి ఉన్న పొలానికి రెవెన్యూ అధికారులు అడంగళ్‌ ఇవ్వడంలేదని ఐదేళ్ళుగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని న్యాయం చేయాలని కొయ్యలగూడానికి చెందిన మందా రామరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

స్పందనపై జేసీ సమీక్ష

జిల్లాలో స్పందన ద్వారా స్వీకరిస్తున్న రెవెన్యూ అర్జీల పరిష్కారంపై సోమవారం జేసీ అరుణ్‌ బాబు తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన 75 రెవెన్యూ అర్జీల అండార్స్‌ మెంట్‌, ర్యాండమ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధించిన ఫొటోలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌ లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేశారు. అండా ర్స్‌మెంట్‌ పొందిన అర్జీదారునిపై జేసీ ఫోన్‌ చేసి సమస్య పరిష్కారంపై అడిగి తెలుసుకున్నారు. ద్వారకా తిరుమల, దెందులూరు, గణపవరం, చిం తలపూడి, బుట్టాయిగూడెం, తదితర మండలాల రెవెన్యూ స్పందన అర్జీలపై సమీక్ష నిర్వహించారు. డీఆర్వో సత్యనారాయణమూర్తి, కలెక్టరేట్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:15:09+05:30 IST