‘బిందు సేద్యంలో లక్ష్యాలు సాధించాలి ’

ABN , First Publish Date - 2023-02-01T23:27:29+05:30 IST

బిందు సేద్యంలో నిర్ధేశించిన లక్ష్యాలను మార్చిలోగా సాధించాలని మైక్రో ఇరిగేషన్‌శాఖ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ సీబీ హరినాధరెడ్డి మైక్రో ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు.

‘బిందు సేద్యంలో లక్ష్యాలు సాధించాలి ’
మాట్లాడుతున్న మైక్రో ఇరిగేషన్‌శాఖ అధికారి హరినాథరెడ్డి

ఏలూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 1 :బిందు సేద్యంలో నిర్ధేశించిన లక్ష్యాలను మార్చిలోగా సాధించాలని మైక్రో ఇరిగేషన్‌శాఖ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ సీబీ హరినాధరెడ్డి మైక్రో ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లా మైక్రో ఇరిగేషన్‌ అధికారులు, రాష్ట్ర, జిల్లా కోఆర్డినేటర్లకు బిందుసేద్యం ప్రగతిపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన రైతులకు బిందుసేద్యం రాయితీతో మంజూరు చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమైన పంటలకు బిందు సేద్యం ద్వారా ఎరువులు పండించే ప్రక్రియపై వీడియో రూపొందించి అవగాహన కల్పించాలన్నారు. ఏలూరు జిల్లా పీడీ సి.రవికుమార్‌, ఆయా జిల్లాల పీడీలు, సంబంధిత డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీల కో–ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:27:32+05:30 IST