కాలినడకన వేలాదిమంది భక్తులు

ABN , First Publish Date - 2023-02-02T00:00:06+05:30 IST

చినవెంకన్న క్షేత్రానికి జంగారెడ్డిగూడెం నుంచి ఆరు వేల మంది వరకు పాదయాత్రగా తరలి వచ్చారు.

కాలినడకన వేలాదిమంది భక్తులు
కాలినడకన శేషాచల కొండకు వెళుతున్న భక్తులు

ద్వారకా తిరుమల, ఫిబ్రవరి 1 : చినవెంకన్న క్షేత్రానికి జంగారెడ్డిగూడెం నుంచి ఆరు వేల మంది వరకు పాదయాత్రగా తరలి వచ్చారు. ఏటా మాఘశుద్ద ఏకాదశి రోజున కాలినడకన క్షేత్రానికి వస్తారు. పాతబస్టాండు వద్ద సాయిబాబా మందిరం నుంచి తెల్లవారుజామున యాత్ర ప్రారం భమైనట్టు తెలిపారు. మార్గమధ్యలో వారికి పలు వురు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు.

నేత్రపర్వం.. శ్రీవారి తిరువీధి సేవ

భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తొళక్క వాహనంపై ఉభయదేవేరులతో కొలువు దీరిన శ్రీవారు బుధవారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో భక్తజనులకు దర్శనభాగ్యాన్ని ఇచ్చారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తొళక్కంపై ఉంచి అలంకరించారు. అనంతరం మేళ తాళాల నడుమ తిరువీధులకు తీసుకెళ్లారు. ప్రతీ ఇంటి ముందు దేవతామూర్తులకు హారతి పట్టారు.

Updated Date - 2023-02-02T00:00:08+05:30 IST