వైద్యసేవలు అందక ఆవుల మృత్యువాత

ABN , First Publish Date - 2023-01-26T00:21:40+05:30 IST

వైరస్‌ విజృంభణతో ఆవు, ఆవుదూడలు మృత్యువాత పడుతున్నాయి.

 వైద్యసేవలు అందక ఆవుల మృత్యువాత

వీరవాసరం, జనవరి 25: వైరస్‌ విజృంభణతో ఆవు, ఆవుదూడలు మృత్యువాత పడుతున్నాయి. పశువుల యజమానులు సైతం ప్రభుత్వ పశువైద్యుల దృష్టికి తీసుకు వెళ్ళినా సేవలకు ముందుకు రాలేదనే చెబుతున్నారు. ఇది లంపిస్కిన్‌ వైరస్‌గా పేర్కొంటున్నప్పటికీ ఈ వైరస్‌ ఆవులకు మాత్రమే సోకుతుంది. అదీకాకుండా ఇటీవల కాలంలో పశువైద్యశాఖ బొచ్చు తెగులు రాకుండా వేసే వ్యాక్సిన్లు వేయకపోవటం కూడా కారణంగా చెబుతున్నారు. ఇటీవల మత్స్యపురి, వీరవాసరం గ్రామాలలో ఆవు, ఆవుదూడలు ఈ వైరస్‌ కారణంగా మృత్యువాత పడ్డాయి. ఆవు పడే బాధచూడలేక ప్రైవేట్‌ వైద్యులచే చికిత్స చేయించినా అది తాత్కాలిక ఉపశమనమే అయ్యిందని పశువుల యజమానులు తెలిపారు. .

Updated Date - 2023-01-26T00:21:46+05:30 IST