డ్రోన్‌తో పురుగు మందు పిచికారిపై అవగాహన

ABN , First Publish Date - 2023-02-06T23:37:58+05:30 IST

ఇల్లందలపర్రు గ్రామంలోని సత్తి లోకేష్‌ రెడ్డి పొలం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్‌ ద్వారా పురుగుమందుల పిచికారి కార్యక్రమం రైతులకు ప్రత్యక్షంగా చూపించారు.

 డ్రోన్‌తో పురుగు మందు పిచికారిపై అవగాహన

పెనుమంట్ర, ఫిబ్రవరి 6: ఇల్లందలపర్రు గ్రామంలోని సత్తి లోకేష్‌ రెడ్డి పొలం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్‌ ద్వారా పురుగుమందుల పిచికారి కార్యక్రమం రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. డ్రోన్‌ ద్వారా పురుగుమందులు, తెగుళ్ళ మందులు, ఎరువులు ద్రవ రూపంలో ఉన్నటు వంటువి, డికంపోస్టు వంటివి పిచికారి చేయవచ్చని మండల వ్యవసాయ అధికారి ఎం.జయ దుర్గా మాధురి తెలిపారు. ఎకరానికి రూ.250 నుంచి 350 వరకు ఖర్చు అవుతుం దన్నారు. 10 నుంచి15 నిమిషాలలో ఒక ఎకరంలో పిచికారి చేయవచ్చని తెలిపారు. ఈఏఈ గ్రూపులకు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై డ్రోన్లను అందిస్తుందని తెలిపారు.

Updated Date - 2023-02-06T23:38:05+05:30 IST