లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు

ABN , First Publish Date - 2023-01-25T23:43:18+05:30 IST

సుందర గిరిపై కొలువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫిబ్రవరి ఒకటి నుంచి ఆరో తేదీ వరకు కల్యాణమహోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.

లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు

ఫిబ్రవరి ఒకటి నుంచి ఆరు వరకు.. 3న కల్యాణం

ద్వారకాతిరుమల, జనవరి 25 : సుందర గిరిపై కొలువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫిబ్రవరి ఒకటి నుంచి ఆరో తేదీ వరకు కల్యాణమహోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్‌ జగన్నాఽథపురంలో వచ్చేనెల ఒకటిన ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లి కుమార్తెలుగా చేస్తారు. సాయంత్రం ఆరు గంటలకు ధ్వజావరోహణ, 2న నిత్యహోమాలు, మూల మంత్రహవనాలు, 3న ఉదయం కల్యాణమహోత్సవం, 4న నిత్యహో మాలు, గ్రామోత్సవం జరుగుతుందన్నారు. 5న పంచామృతాభిషేకాలు, శ్రీచంద నోత్సవం, ధ్వజ అవరోహణ, 6న ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీపుష్సయాగంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని భక్తులు గమనించాలని కోరారు.

Updated Date - 2023-01-25T23:43:18+05:30 IST