అధికార పార్టీ కౌన్సిలర్ల వాకౌట్‌ సిగ్గుచేటు

ABN , First Publish Date - 2023-02-01T23:52:55+05:30 IST

బొబ్బిలి మునిసిపల్‌ కౌన్సిల్‌ చరిత్రలో మంగళవారం నాటి కౌన్సిల్‌ సమావేశం తీరు బ్లాక్‌ డేగా నిలుస్తుందని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మునిసిపల్‌ కౌన్సిలర్‌ రాంబార్కి శరత్‌బాబు, మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ గెంబలి శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు.

అధికార పార్టీ కౌన్సిలర్ల వాకౌట్‌ సిగ్గుచేటు

బొబ్బిలి: బొబ్బిలి మునిసిపల్‌ కౌన్సిల్‌ చరిత్రలో మంగళవారం నాటి కౌన్సిల్‌ సమావేశం తీరు బ్లాక్‌ డేగా నిలుస్తుందని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మునిసిపల్‌ కౌన్సిలర్‌ రాంబార్కి శరత్‌బాబు, మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ గెంబలి శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. బుధవారం స్థానిక దర్బారుమహల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిసిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై ధ్వజమెత్తుతూ కౌన్సిలర్లు వాకౌట్‌ చేయడం చైర్మన్‌ పనితీరుకు నిదర్శనమ న్నారు. రెండేళ్ల మునిసిపల్‌ పాలనలో సొంతపార్టీకి చెందిన కౌన్సిలర్లు రెండుదఫాలు ఎమ్మెల్యే సమక్షంలో వాకౌట్‌ చేయడం, ఏసీబీ ఎంక్వయిరీ జరగడం సిగ్గుచేటన్నారు. చైర్మన్‌కు పరిపాలనా దక్షత, అవగాహన ఏమాత్రం లేవన్నారు. ఫ్లోర్‌లీడరు గెంబలి శ్రీనివాసరావును సైతం బెదిరింపు ధోరణిలో కౌన్సిల్‌ సమావేశంలోనే సంబోధించిన వి షయాన్ని ప్రస్తావించారు. ప్రజల నుంచి చైర్మన్‌గా ఎన్నుకోబడలేదు కాబట్టి ఆయ నకు జవాబుదారీతనం లోపించిందన్నారు. బడ్జెట్‌ సమావేశంలో రెండు పార్టీల వారు వాకౌట్‌ చేస్తే మరోసారి సమావేశం నిర్వహించి అన్ని అంశాలను సామరస్యంగా చ ర్చించాలన్న కనీస సాంప్ర దాయాన్ని పాటించకండా బడ్జెట్‌ను ఎలా ఆమోదిసా ్తరని వారు ప్రశ్నించారు. కౌన్సిల్‌లో ఆయనకు స భ్యుల బలం లేదని, తక్షణ మే సభ్యుల విశ్వాసాన్ని కౌన్సిల్‌లో నిరూపించు కోవా లని, లేకుంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఫ వార్డుల్లో చిన్నపాటి పనులు సైతం చేయడం లేదని, వీధి దీపాలు, కాలువలపై పల కలు, మరమ్మతులు తదితర పనులకు తమ జేబుల్లోనుంచి ఖర్చు చేసుకుంటున్నా మన్నారు. 20వ వార్డులో కొత్తస్తంభాలకు వీధి దీపాలు వేయడం లేదని, ఏమని అడిగితే క్లాంపులు లేవని అంటున్నారని ఆ వార్డు ఇన్‌చార్జి సాలా రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపాలిటీలో పరిపాలనను గాడిలో పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మహిళా కౌన్సెలర్లు కింతలి శ్రీదేవి, వెలగాడ హైమావతి, కళ్యంపూడి లక్ష్మీసత్యనారాయణ, బొత్స సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:52:58+05:30 IST