అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-01-26T00:24:48+05:30 IST

అంగన్‌వాడీల సమస్యల ను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి హెచ్చరించారు.

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

గజపతినగరం: అంగన్‌వాడీల సమస్యల ను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి హెచ్చరించారు. బుధవారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయంలో సమస్యల పరిష్కరించాలని కోరుతూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీల వేతనం రూ.26 వేలు పెంచాలని, ముఖహాజరు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, జాబ్‌ క్యాలెండర్‌ నిర్ణయించాలతని కోరారు. అలాగే వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని, ర్యాలీలు, సభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోనెం. 1ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు జి.సన్యాసమ్మ, కె.రమణమ్మ, శోభ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:24:48+05:30 IST